కృష్ణా జిల్లా గుడివాడలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో కొడాలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. మంత్రి కొడాలి నాని, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, కైకలూరు దూలం నాగేశ్వరావులు కాసేపు క్రికెట్ ఆడి ఆలరించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ స్టేడియంలో.. రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభించటం సంతోషదాయకమన్నారు. ఈ పోటీలు 25 వరకు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యానందం, స్టేడియం వైస్ ప్రెసిడెంట్ పాలేటి చంటి, పాలకవర్గం సభ్యులు, టోర్నమెంట్ నిర్వాహకులు మెరుగుమాల కాళీ పాల్గొన్నారు.
ఇవీ చూడండి...