ETV Bharat / state

'మీ పిల్లల్ని చదవించండి... ఖర్చు మేము భరిస్తాం'

రాష్ట్రంలో చాలా మంది చిన్నారులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అలాంటి సమస్యలు ఉండవని... ప్రతి చిన్నారని చదివించే బాధ్యత తమదని చెప్పారు.

author img

By

Published : Jun 15, 2019, 3:38 PM IST

చిన్నారులతో కొడాలి నాని
రాజన్న బడి బాటలో కొడాలి నాని

ఏపీలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని దాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడ ఏజీకే పాఠశాలలో నిర్వహించిన "రాజన్న బడి బాట" కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేపించి అనంతరం పుస్తకాలు ,దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కుటుంబాలకు అమ్మ ఒడి పథకం కింద 15000 రూపాయలు అందజేస్తామని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ బడులకు పంపితే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి కొడాలి నాని వివరించారు.

Intro:ap_tpg_81_15_agnipramadam_ab_c14

Body:దెందులూరు మండలం సానిగూడెం లో అగ్ని ప్రమాదం జరిగింది గంగన్నగూడెం గ్రామానికి చెందిన పాతూరు రాజా రామ్మోహన్ రాయ్ కు చెందిన ఆయిల్ ఫామ్ తోటలో కట్ట నిప్పంటుకొని ఆయిల్ ప్రముఖులతోపాటు కోకో డ్రిప్ పరికరాలు టేకు చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతు రాజా రామ్మోహన్ రాయ్ తెలిపారు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల గాని ఎవరైనా అజాగ్రత్తగా పొగతాగడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానిక వరప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.