పార్టీ నిర్ణయానికి భిన్నంగా కశ్మీర్ అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో ట్వీట్ చేశారు. కశ్మీర్ విషయంలో జరిగిన తీరు ఆమోదయోగ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఆంధ్ర ప్రజల గొంతు నొక్కి విభజన చేశారని.. నేడు కశ్మీర్ ప్రజల గొంతు నొక్కి ప్రక్రియను పూర్తి చేశారని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా, గులాంనబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా వంటి నాయకులకైనా వారి వాదన వినిపించే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.కాగా కశ్మీర్ అంశంపై కేంద్రం తీసుకున్న చర్యలను తెదేపా సమర్థించన సంగతి తెలిసిందే !
ఇదీ చదవండి.