కాపు సామాజిక వర్గానికి వైకాపా ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని కాపునాడు విజయవాడ అర్బన్ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... కాపులకు వైకాపా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ఓటింగ్ శాతం తగ్గిందని ఆరోపించారు. కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుంటే... భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాలకు వెళ్లిన విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు నేస్తంతో పాటు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
ఇదీచదవండి.