కృష్ణా జిల్లా గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలోని నగదు అపహరణకు గురైంది. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంట వ్యవధిలోనే గ్రామ రక్షక దళాల సహాయంతో పోలీసులు నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. నేరగాళ్లను పట్టుకునేందుకు సహకరించిన గ్రామ రక్షకదళ సభ్యులు 15 మందిని పోలీసులు అభినందించారు. ముఖ్య పాత్ర వహించిన ఇద్దరిని గ్రామస్థుల సమక్షంలో సన్మానించి, నగదు బహుమతి అందజేశారు. గ్రామాల్లో ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాల మంచి ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బందరు రూరల్ సీఐ, గూడూరు ఎస్ఐ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: