కరోనా వంటి కష్ట కాలంలో రాజకీయాలు తగవని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. జగ్గంపేటలో 500 మంది పారిశుద్ధ్య కార్మికులను నెహ్రూ సన్మానించారు. వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు. కష్టకాలంలో కార్మికుల సేవలు అద్భుతం అని నెహ్రూ అన్నారు. అనంతరం కరోనా నివారణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ర్యాపిడ్ టెస్టు కిట్లు విషయంలో జరుగుతున్న అవినీతిని అయన ప్రశ్నించారు. డబ్బుల సంపాదన మాని ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇదీ చదవండి: