సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదన్న కారణం చూపుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ప్రభుత్వ సలహదారు, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా నిబంధనలను అమలు చేస్తూనే ఎన్నికలు పూర్తి చేస్తే... హైకోర్టు అవేమీ పరిగణలోకి తీసుకోకుండా తీర్పు వెలువరించిందని వ్యాఖ్యానించారు.
అప్పీలుకు వెళ్తాం..
సింగిల్ జడ్జి తీర్పు దృష్ట్యా తదుపరి ప్రక్రియపై ఎస్ఈసీ అప్పీలుకు వెళ్తుందని సజ్జల పేర్కొన్నారు. డివిజన్ బెంచ్‌కు వెళ్లే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని తెలిపారు. చివరకు న్యాయమే నిలబడుతుందని విశ్వసిస్తున్నామన్నారు. ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని తెలిసే తెదేపా కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
నిబంధనల ప్రకారమే..
ఎంపీ రఘురామకృష్ణ రాజుపై ప్రాథమిక ఆధారాలు, నిబంధనల ప్రకారమే సీఐడీ ముందుకు వెళ్లిందని సజ్జల స్పష్టం చేశారు. నేర దర్యాప్తు విభాగం పోలీసుల అంశంలో అభ్యంతరాలేమీ లేవని సుప్రీం అభిప్రాయపడినట్లు భావిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి : సుప్రీంలో ఎంపీ రఘురామకు ఊరట.. బెయిల్ మంజూరు