ETV Bharat / state

'పౌరుసత్వం నిరూపించుకోవటంలో తప్పులేదు' - పౌరుసత్వం బిల్లుపై జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు

భారతదేశం ధర్మశాల కాదనీ, దేశ భద్రత చాలా ముఖ్యమైందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. పౌరుసత్వాన్ని నిరూపించుకోవటంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు.

jd lakshminarayana on nrc and caa
ఎన్నార్సీపై జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు
author img

By

Published : Feb 3, 2020, 8:42 AM IST

ఎన్నార్సీపై జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు

ఎన్నార్సీ, సీఏఏ చట్టాలను రాజకీయ కోణంలో చూడకూడదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన కనెక్టింగ్ విత్ గ్రేట్ మైండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ, ఎన్నార్సీ, సీఏఏ చట్టాల అమలు వలన ప్రజలకు ఎటువంటి నష్టం ఉండదని ప్రధాని మోదీ హమీ ఇచ్చారన్నారు. అసోంలో శరణార్థుల సమస్య పరిష్కారం కోసమే ఎన్నార్సీ బిల్లు తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ చట్టాల గురించి అపోహలు వస్తున్న పరిస్థితుల్లో యువత ఈ బిల్లుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు. భారతదేశం ధర్మశాల కాదన్న ఆయన... దేశ అంతర్గత భద్రత చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సిటిజన్ షిప్​ను నిరూపించుకోవటంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. యువత తలుచుకుంటే రాజకీయాల్లో మార్పు సాధ్యమేననీ, మార్పు తీసుకురావటమే లక్ష్యంగా నేటితరం యువత ముందుకు రావాలని సూచించారు. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పనిచేసే తత్వాన్ని అలవర్చుకుంటే ఉన్నత స్థానానికి చేరవచ్చని విద్యార్థులకు సూచించారు.

ఇదీ చదవండి: భాజపాలో చేరికపై లక్ష్మీనారాయణ ఏమన్నారో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.