ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పెరగకముందే వైకాపా ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలు జరుపుతోందని మైలవరం నియోజకవర్గ భాజపా సమన్వయకర్త నూతలపాటి బాలకోటేశ్వరరావు అన్నారు. అందుకే ఎన్నికల కమిషన్ను కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ అసమర్ధ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, రాష్ట్ర శ్రేయస్సు కోసం కృషి చేస్తామని జనసేన నేత అక్కల రామ్మోహన్ రావు తెలిపారు.
ఇదీచదవండి.