Jai Bheem Bharat Party founder Jada Shravan Kumar : జగన్ పాలన ప్రతి ఒక్కరికి జీవన్మరణ సమస్యగా మారిందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. దళితులు, సామాన్యులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ,స్వేచ్ఛ లేకుండా పోయిందని పేర్కొన్నారు. తొండంగిలో జరిగిన దళిత యువకుడు హత్య తనను కలచివేసిందని, సీఎం సొంత ఇలాఖాలో డాక్టర్ అచ్చెన్న హత్య ఘటన సంచలనం రేపుతోందన్నారు.
అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తే చంపేస్తారా..? దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. రాష్ట్రంలోకి అడుగుపెట్టాలంటే భయంగా ఉంది... తనకు ప్రాణహాని ఉందని చెప్పడం జగన్ ప్రభుత్వం తీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఉండవల్లి శ్రీదేవి ఇంటిపై దాడి చేసినా, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసినా తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఆమె మా దళిత బిడ్డ.. మేము కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మిగతా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై ఎందుకు దాడులు చేయలేదు.. ఎందుకు వారిపై సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టలేదని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.
రాజధాని సాధన కోసం తిరగబడతాం... దళితులంటే జగన్ సర్కార్‌కు చులకన భావమన్నారు. ఉండవల్లి శ్రీదేవి మేక అని బలి ఇచ్చారు.. ఇప్పుడు పులిలా తిరగబడిందని పేర్కొన్నారు. రాజధాని సాధన కోసం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సీక్రెట్ ఓటు ఎవరికి ఓటు వేశారో కనుక్కోవడం నేరం కాదా ? దీనిపై సీఎం జగన్, సజ్జలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళిత డాక్టర్ మర్డర్‌పై లోతుగా దర్యాప్తు చేసి 24 గంటల్లో హత్య వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కడప జిల్లాలో జైభీం భారత్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. దళితులకు మేనమామ అంటావు.. దళితులనే పొట్టన బెట్టుకుంటావని బహుజన జేఏసీ నేత పోతుల బాలయ్యకోట, సీఎం జగన్‌పై ఆరోపణలు చేశారు. రాజ్యాధికారం కోసం దళితులను పావులుగా వాడుకుంటున్నావని మండిపడ్డారు.
న్యాయ సహాయం కోసం దశ యాప్.. రాక్షస పాలన అంతమే తన ధ్యేయమని, జగన్ రాక్షస పాలనను అంతం చేసి రాష్ట్రాన్ని కాపాడడానికి తన చివరి శ్వాస వరకూ పోరాటం చేస్తానని శ్రావణ్‌కుమార్ గతంలోనూ తెలిపారు. ప్రభుత్వ బాధితులకు న్యాయ సహాయం అందించడానికి దశ యాప్ మార్చి 12న ఆయన ప్రారంభించడం విదితమే. న్యాయ సహాయం కోసం బాధితులు ఏ మారుమూల గ్రామం నుంచి మెసేజ్ పెట్టినా.. న్యాయవాదుల బృందం సహాయం అందించడం ఈ యాప్ ఉద్దేశం. ఇందుకు గాను ప్రత్యేకంగా 50మంది న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేశారు. యాప్‌ను అధికారికంగా ప్రారంభించక ముందే 300మందికి పైగా సమస్యలను అప్‌లోడ్ చేయడం విశేషం.
ఇవీ చదవండి :