ETV Bharat / state

Jaggaiyapet swimmers : ఈత పోటీల్లో చేప పిల్లలు వీరు..! జగ్గయ్యపేట స్విమ్మర్స్​కు పతకాల పంట - 22 మంది 59 పతకాలు

Jaggaiyapet swimmers : జగ్గయ్యపేటకు చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విజయ కేతనం ఎగురవేసి తమ ఘనతను చాటుకున్నారు. డ్రీమర్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ ఈత పోటీలకు వెళ్లిన 22 మంది 59 పతకాలను సాధించి ప్రశంసలు అందుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 30, 2023, 1:12 PM IST

Jaggaiyapet swimmers : ఈత క్రీడలో తమదైన ముద్ర వేస్తున్న జగ్గయ్యపేట ఈత క్రీడాకారులు మరోసారి జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో విజయ కేతనం ఎగురవేసి తమ ఘనతను చాటుకున్నారు. జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన జాతీయ ఈతల పోటీలకు వెళ్లిన 22 మంది జగ్గయ్యపేట క్రీడాకారులు 59 పతకాలను సాధించి ప్రశంసలు అందుకున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) వారు న్యూఢిల్లీలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్ నిర్వహించిన 8వ జాతీయ ఈతల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున వెళ్లిన జగ్గయ్యపేట క్రీడాకారులు విజయధుందుబి మోగించారు.

'ఫ్యాన్స్​కు గిఫ్ట్ ఇస్తా.. కష్టమైనా వచ్చే సీజన్​లో ఆడతా'.. రిటైర్మెంట్​పై ధోనీ క్లారిటీ

22 మంది.. 59 పతకాలు.. బృందానికి శిక్షకులుగా ఉన్న పోట్ల బత్తిన పాండురంగారావు, లక్ష్మి ఆధ్వర్యంలో మొత్తం ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు, ఇద్దరు బాలికలు, ఐదుగురు బాలురు పోటీలకు తరలివెళ్లారు. 22 మంది తమ ప్రతిభ కనబరిచి మొత్తం 36 పసిడి, 19 రజత, 4 కాంస్య పతకాలను సాధించారు. వీరంతా ఫ్రీస్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రష్డ్ స్ట్రోక్, 200మీ.లు, 100 మీ.లు, 50 మీ.లు, 25 మీ.ల విభాగాల్లో ప్రతిభను కనబర్చారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారుల్లో గంజిబాబు (75సం.) 2 పసిడి, 1 రజితం, దిడ్డి పాండురంగారావు (65 సం.) 3 పసిడి పతకాలు, పోట్ల బత్తిన పాండురంగారావు (55సం.) పసిడి పతకాలు, బి.వననాగలక్ష్మి (55సం.) 1 పసిడి, 2 రజితం, పొట్టాబత్తిన లక్ష్మి (50సం.) 3 పసిడి పతకాలు, పి.రమాదేవి (45సం) రజత పతకాలు, ఎం.శోభ (45సం.) 2 పసిడి, 1 కాంస్య, ఎస్.ఆదిలక్ష్మి (40సం.) 3 పసిడి పతకాలు, కె.సరితాదేవి (40సం.) 3 పసిడి పతకాలు, ఎం.వినూష (30సం.) 3 పసిడి పతకాలు, వై.రామారావు (35సం.) 2 పసిడి, 1 రజత పతకాలు కైవసం చేసుకున్నారు.

ఈ ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన ప్లేయర్లు వీళ్లే .. ఎవరెలా ఆడారంటే!

అండర్ 35 విభాగంలో... పసిడి, బాలల విభాగంలో డి. తేజ్ 2 పసిడి, 1 రజత, సీజీ దీపక్ 2 పసిడి, 1 రజత, డి.సతీష్ 2 పసిడి, 1 రజత, అండర్ 14 విభాగంలో ఎ.తనిష్క 1 పసిడి, 2 రజత, జి. మాధవ్ 2 రజత, 1 కాంశ్య, సిహచ్. కుశాల్ 1 పసిడి, 2 కాంస్య, టీఎం. చరణ్ తేజ 1 పసిడి, 2 రజత పతకాలు సాధించారు. జి.లోకేష్ 2 రజతం, వి. నాగార్జున 2 రజత. ఎం. అనన్యలక్ష్మి సాయి 1 పసిడి పతకాలను సాధించారు. పతకాలు సాధించిన విజేతలను పలువురు అభినందించారు.

CSK VS GT Final : చివర్లో జడ్డూ మ్యాజిక్​.. ఐదోసారి కప్పును ముద్దాడిన చెన్నై సూపర్ కింగ్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.