కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో 'జగనన్న మీ తోడు బీసీలు' అంటూ సంఘీభావ యాత్ర నిర్వహించారు. పామర్రులోని మంటాడ గ్రామం నుంచి వైకాపా శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు, పార్టీ మద్ధతుదారులు పాల్గొన్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ఆ ఘనత జగన్ సర్కార్‌దే..
56 బీసీ కులాలకు ఫెడరేషన్ ఛైర్మన్లుగా పదవులు రావడం వైఎస్ జగన్ ప్రభుత్వ గొప్పతనమేనని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పదవులు తీసుకున్నవారు తమ కులంలోని చివరి మనిషి వరకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కోరారు.
ఏ కార్పొరేషన్ ఛైర్మన్‌కు పదవులిచ్చినా..
రాజకీయంగా, ఆర్థికంగా కులస్థుల అభ్యున్నతికి దోహదపడాలని నేతలు సూచించారు. గత ప్రభుత్వం ఏ కార్పొరేషన్ ఛైర్మన్‌కు పదవులు ఇచ్చినా చివరి క్షణంలో ఎన్నికల కోసమే ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. జగనన్న మాట ప్రకారం బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ పదవులు కట్టబెట్టారని సజ్జల స్పష్టం చేశారు.
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, పెనమలూరు శాసనసభ్యుడు కొలుసు పార్థసారథి, తిరువూరు శాసనసభ్యుడు రక్షణ నిధి, పెడన, పామర్రు ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలా అనిల్ కుమార్ పాల్గొన్నారు.