ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా 'జగనన్న వసతి దీవెన' ప్రారంభం - jagananna vasathi dhevena scheme news

'జగనన్న వసతి దీవెన' పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఓ ఇంట్లో ఎందరు చదువుకున్నా సరే.. అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగనన్న వసతి దీవెన పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న వసతి దీవెన ప్రారంభం

author img

By

Published : Feb 24, 2020, 11:32 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న వసతి దీవెన ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఘనంగా ప్రారంభమైంది.

కృష్ణా జిల్లాలో..

మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మైలవరం నియోజకవర్గంలో 8,034 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

విజయవాడ ఎస్​ఆర్​ఆర్​ కళాశాల ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 'జగనన్న వసతి దీవెన' కార్డులను కళాశాల విద్యార్థులకు ఆయన పంపిణీ చేశారు.

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని స్పష్టం చేశారు. మచిలీపట్నం జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ పథకం ద్వారా దాదాపు లక్షా 20 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు.

అవనిగడ్డలోని డిగ్రీ కళాశాలలో 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలోని 6,235 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

విశాఖ జిల్లాలో..

నర్సీపట్నం సిటీ క్లబ్​లో 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్​ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 'జనగన్న వసతి దీవెన' కార్డులను విద్యర్థులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

అరకు లోయలో ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చిట్టి పాల్గుణ లాంఛనంగా ప్రారంభించారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాల్గుణ అన్నారు.

చిత్తూరు జిల్లాలో..

పేదవాడికి నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జగనన్న వసతి దీవెన కార్డులను ఆయన పంపిణీ చేశారు.

మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాష తెలిపారు. నవరత్నాల్లో పేర్కొన్న పథకాలన్నింటినీ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని కొనియాడారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

శంఖవరంలో 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. 'జగనన్న వసతి దీవెన' వంటి పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే కొనియాడారు.

గుంటూరు జిల్లాలో..

మేడికొండూరు మండలం పేరేచర్లలో 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రారంభించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని శ్రీదేవి అన్నారు. ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సూచించారు.

కడప జిల్లాలో..

అనంతరాజుపేటలోని వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం విప్, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు 'జగనన్న వసతి దీవెన' పథకం ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో ఐదువేల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ప్రజాప్రతినిధులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ప్రజాప్రతినిధులు తెలిపారు.

హంపాపురంలో గ్రామంలోని ఎస్వీఐటీ డిగ్రీ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల చదువుల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి మరెన్నో పథకాలు తీసుకొస్తారని ఎమ్మెల్యే అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

విజయనగరం జిల్లాలో..

విజయనగరంలోని అయోధ్య మైదానంలో 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ఓ ప్రైవేట్​ ఫార్మసీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సభ నుంచి మూడు కిలోమీటర్ల దూరం నడవడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో..

విద్యాశాఖకు ముఖ్యమంత్రి వైఎస్​ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని.. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ఆయన 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 11 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,300 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు 'జగనన్న వసతి దీవెన' కార్డులు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

వారితో యుద్ధం చేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.