రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ సహా ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకుడు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం..
మార్కాపురం - 5.4 సెంటీమీటర్లు, సాలూరు - 5 , నందికొట్కూరు - 4.2 , అవుకు - 3.7 ,సీతంపేట - 3, రాజానగరం - 2.3 , కడప - 2.3 , పాలకొండ - 2 , అనంతగిరి - 1.7 , గుంతకల్లు - 1.7, కలకాడ - 1.5 , బాపట్ల - 1.5 , నెల్లూరు - 1.4 , సిద్దవటం - సెంటీమీటర్ల వర్షపాతం నమోంది.
ఉష్ణోగ్రతల వివరాలు..
విజయవాడ - 29 డిగ్రీలు, విశాఖపట్నం - 31, తిరుపతి - 31, అమరావతి - 31, విజయనగరం - 34, నెల్లూరు - 30, గుంటూరు - 32, శ్రీకాకుళం - 32, కర్నూలు - 26, ఒంగోలు - 28, ఏలూరు - 30, కడప - 27, రాజమహేంద్రవరం - 29 , కాకినాడ - 29, అనంతపురం - 28 డిగ్రీలుగా నమోదైంది.
అలర్ట్ : రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు