వైఎస్ సమాధి వద్ద పక్కనే కూర్చున్న తల్లి, చెల్లినే పలకరించలేని జగన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలను ఎలా గౌరవిస్తారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి నిలదీశారు. "మహిళా పక్షపాతినని రెండున్నరేళ్లుగా ప్రగల్భాలు పలుకుతున్నజగన్ రెడ్డి, వైఎస్ సమాధి వద్ద 45నిమిషాల పాటు విజయమ్మ, షర్మిల పక్కనే కూర్చున్నా పలకరించలేదన్నారు. వైకాపాకు, షర్మిల పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ నిర్వహించిన.. రాజశేఖర్ రెడ్డి వర్థంతి సభకు జగన్ సహా వైకాపా నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తి వారి కోసం పాటు పడతాననడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఏపీలో మహిళలపై జరిగినన్ని అఘాయిత్యాలు మరే రాష్ట్రంలోనూ లేవు" అని దుయ్యబట్టారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనపై హైకోర్టు కీలక ఆదేశాలు