ETV Bharat / state

హుండీల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్​ - కృష్ణా జిల్లా తాజా క్రైం న్యూస్​

ఆలయాల్లో దొంగతనానికి పాల్పడుతూ... ఎవరికీ చిక్కకుండా తిరుగుతున్న అంతరాష్ట్ర దొంగను కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీసులు అరెస్ట్​ చేశారు.

interstate criminal arrested by Vissannapetaa police Krishna district
హుండీల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్​
author img

By

Published : Sep 29, 2020, 5:16 PM IST

రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో... కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ఈ నెల 14న కొర్లమండ గ్రామం శివారులోని దాసాంజనేయ స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పగలకొట్టిన ఘటనపై 4 బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించారు.

దర్యాప్తులో భాగంగా... కొర్లమండ శివారు విద్యానగరం వద్ద అంతరాష్ట్ర నేరస్తుడు పఠాన్​ సలార్ ఖాన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి చోరీకి అవసరమైన ఆయుధాలతో పాటు రూ. 2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు ఆలయాల్లో హుండీల చోరీకి పాల్పడ్డట్లు విచారణలో తెలిందని తిరువూరు సీఐ వివరించారు. పఠాన్​పై పలు పోలీసు స్టేషన్​ల్లో సుమారు 80 కేసులు ఉన్నాయి. అతడిని తిరువూరు కోర్టులో హాజరు పరుస్తామని సీఐ ఎం.శేఖర్ బాబు తెలిపారు.

ఇదీ చూడండి:

'నా సోదరుడిపై దాడి కేసులో సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.