ETV Bharat / state

ఏపీ-కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేత

inter-city-bus-service-between-ap-and-karnataka-stopped

author img

By

Published : Jul 13, 2020, 4:17 PM IST

Updated : Jul 13, 2020, 4:59 PM IST

16:13 July 13

ఈనెల 15 నుంచి 23 వరకు కర్ణాటకకు బస్సులు నిలిపివేత

ఏపీ-కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. బెంగళూరులో లాక్‌డౌన్ దృష్ట్యా ఈనెల 15 నుంచి 23 వరకు కర్ణాటకకు బస్సులు నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్​ఆర్టీసీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో మంగళవారం రాత్రి నుంచి కర్ణాటకకు సుమారు 140 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తున్నామని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. దీనిపై కర్ణాటక అధికారులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. 

 తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాక బస్సులు నడుపుతాం. లాక్‌డౌన్ వల్ల పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, గుంటూరుతో పాటు ఒంగోలుకూ బస్సులు నడపలేకున్నాం. ఇతర జిల్లాల్లో బస్సు ప్రయాణాల ద్వారా కొవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రయాణికులు అత్యవసరమైతేనే బస్సుల్లో ప్రయాణించాలి- బ్రహ్మానందరెడ్డి, ఆర్టీసీ ఈడీ

ఇదీ చదవండి

సీఎం జగన్​కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లేఖ...ఎందుకంటే ?

Last Updated : Jul 13, 2020, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.