కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. నందిగామ నుంచి వస్తున్న లారీని ఆపి సోదాలు చేయగా రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. లారీని సీజ్ చేశారు. రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కంచికచర్ల పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: పెద్ద అవుటపల్లి రోడ్డుపై గుర్తుతెలియని మృతదేహం