దేశవ్యాప్తంగా ఎగుమతులను ఏ మార్గాల ద్వారా పెంపొందించవచ్చన్న అంశంపై బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్ధిక వ్యవస్థలో మందగమనం నెలకొన్న తరుణంలో ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణ, పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. మన దేశం నుంచి వస్తుసేవల ఎగుమతులను భారీ స్థాయిలో పెంచే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు, ఎగుమతి దారులు, పరిశ్రమలకు చెందిన సభ్యులు తదితర వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి అభిప్రాయాలను వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో పాటు అవసరం లేని ఉత్పత్తుల దిగుమతులకు అడ్డుకట్ట వేసే అంశాలపై కూడా భేటీలో చర్చించారు.
ఇది కూడా చదవండి.