తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 1,500 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా నందిగామ మండలం కొణాత్మకూరు (AP Telangana Boarder) చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఖమ్మం నుంచి ఆంధ్రాకు.. (AP 20 AJ 2228) కారులో తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు.
మధిర వైపు నుంచి వస్తున్న కారులో మద్యంతో పాటు, ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఈబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి మద్యం అమ్మిన వెంకట్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ వకుల్ జిందాల్(SEB) తెలిపారు. అక్రమ మద్యం తరలింపునకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చదవండి:
'ఓటరు నమోదుకు అర్హత తేదీలను పెంచండి'
ఫీవర్ సర్వేలో తప్పులు నమోదు చేస్తున్న సిబ్బందిపై చర్యలు: జేసీ శివశంకర్