ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత... నలుగురి అరెస్టు - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

విజయవాడకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలో పోలీసులు పట్టుకున్నారు. 40 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకోగా... నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

illlegal drugs catch by krishna district polices
అక్రమ తరలిత గంజాయి పట్టివేత... నలుగురు నిందితులు అరెస్టు
author img

By

Published : Jun 26, 2020, 5:12 PM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం, ఈదులగూడెం గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా... విశాఖపట్నం నుంచి న్యూజివీడు మీదుగా విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 40 కేజీల గంజాయిని, రెండు కార్లను, స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు పాటి శ్రీనివాసరావు, రాజు, సురేష్, మనోజ్​లుగా గుర్తించారు. పట్టుబడిన వారిలో పాటి శ్రీనివాసరావు సూత్రధారి కాగా, అతనికి, అతని సహచరులకు గెమిలి రాజు ,విశాఖ ఏజన్సీ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి సరఫరా చేస్తున్నట్లు విచారణలో స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తదుపరి విచారణ కోసం రిమాండ్​కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 605 కరోనా కేసులు... 10 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.