కృష్ణాజిల్లా పులిగడ్డ అక్విడెక్ట్ సమీపంలో కృష్ణానదిలో యువకుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు.. యువకుడి మృతదేహాన్ని పరిశీలించి.. అవనిగడ్డ మండలం, సీతాయలంకకు చెందిన ఒడుగు సతీశ్‌గా గుర్తించారు. మృతదేహానికి అవనిగడ్డ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం చేయనున్నట్లు తెలిపారు. ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవీ చదవండి: అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.. రూ. 5 లక్షల 30వేల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం