డ్రోన్(drone) ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని కృష్ణాజిల్లా నందిగామ మున్సిపాల్టీలో పిచికారీ చేశారు. చెన్నైకి చెందిన గరుడ ఏరోస్పేస్ అనే సంస్థ డెమో ఇవ్వటానికి నందిగామలో ఉచితంగా ద్రావణాన్ని చల్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,3 మున్సిపాలిటీలోని ఈ విధంగా శానిటేషన్ నిర్వహించినట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నందిగామ ఛైర్పర్సన్ మండల వరలక్ష్మి, కమిషనర్ జయరాములు ప్రారంభించారు. ఈ ద్రావణం డ్రోన్(drone) నుంచి చిరుజల్లులు మాదిరిగా కిందకీ పడటంతో కరోనాతో పాటు ఇతర వైరస్ నివారణకు ఈ పద్ధతి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరంలో నివారించవచ్చునని కమిషనర్ తెలిపారు
ఇదీ చదవండీ.. dead bodies : క్వారీగుంతలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం