Hyderabad Police Commissioner In Controversial: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీచట్టం నమోదు వ్యవహారంలో న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ న్యాయవాది కరుణాసాగర్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ పేరిట ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో పార్కర్ పెన్ను ఆర్డర్ చేయడం చర్చనీయమైంది. రాజాసింగ్‌పై పీడీ చట్టం నమోదు చేయడం విచారణ సందర్భంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది.
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ 1650 పేజీలతో కౌంటర్ సిద్ధం చేశామని దానిపై సంతకాలు చేసి కోర్టులో సమర్పించేందుకు గడువు కావాలని కోరారు. న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 28 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్ కౌంటర్‌పై నగర పోలీసు కమిషనర్ త్వరగా సంతకం చేయాలంటూ న్యాయవాది కరుణాసాగర్ రూ.357 ఖరీదైన పార్కర్ పెన్ను, రీఫిల్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయానికి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో బుక్ చేశారు.పే క్యాష్ ఆన్ డెలివరీ అని ఆర్డర్ చేశారు. ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి: