భార్యపై కోపం.. బూడిదైన ద్విచక్రవాహనం - latest news of payakapuram Vijayawada bike issue
భార్యపై కోపంతో ఓ వ్యక్తి ద్విచక్రవాహనాన్ని తగలబెట్టాడు. కృష్ణాజిల్లా విజయవాడ నగరంలోని కొత్తపేటకు చెందిన కొండలరావుకు పాయికాపురం రాధనగర్కు చెందిన మహిళతో వివాహమైంది. కానీ భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో భర్త కోపం పెంచుకున్నాడు. అతిగా మద్యం తాగి మామగారి ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు నిలిపి ఉన్న వేరే వారి ద్విచక్రవాహనంపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు కొండలరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య భర్తల మధ్య గొడవకు తన బైక్ బూడిదైందని బాధితుడు వాపోయాడు.