దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో వైద్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ ప్రభుత్వాసుపత్రి నూతన భవనంలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఇక్కడి సిబ్బందితో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో ఎల్సీడీ తెరను అందుబాటులో ఉంచారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ ఆసుపత్రికి రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఈ క్రమంలో విజయవాడ జీజీహెచ్‌లోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఏర్పాట్లు, కార్యక్రమం అమలు తీరుపై... మా ప్రతినిధి పూర్తి వివరాలు అందిస్తారు.
ఇదీ చదవండి