అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాగల ఐఏఎస్ లేదా అడిషనల్ డీజీపీ హోదా కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు గుంటూరులో రూ.10 వేల లోపు బాధితులకు చెక్కుల పంపిణీ చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికగా సీఎం జగన్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరారు. గత 5 ఏళ్లుగా బాధితుల తరఫున చేస్తోన్న పోరాట ఫలమే రేపు గుంటూరులో చెక్కుల పంపిణీ అన్నారు.
ఇదీ చూడండి:
నేతల తప్పులకు అధికారులను బలిచేస్తారా?: యనమల