వెల్వడంలో హోమియో మందుల పంపిణీ - కృష్ణా జిల్లా వెల్వడంలో హోమియో మందుల పంపిణీ
కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు హోమియో మందులను పంపిణీ చేశారు. కరోనా బాధితుల సహాయార్థం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, చారిటబుల్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి అందజేశారు.

కృష్ణా జిల్లా వెల్వడంలో హోమియో మందుల పంపిణీ
కృష్ణా జిల్లా వెల్వడం గ్రామంలో... కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రవాస భారతీయులు లక్కిరెడ్డి చిన పుల్లారెడ్డి, యరమల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైకాపా కార్యాలయంలో 2400 కుటుంబాలకు హోమియో మందులను అందజేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల చెక్కును ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి అందజేశారు.
ఇదీ చదవండి: