ETV Bharat / state

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలి: హోంమంత్రి సుచరిత

ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్​ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Homeminister Mekathoti Sucharitha
రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత
author img

By

Published : Feb 4, 2020, 4:10 PM IST

ప్రత్యేక హోదా మాట నిలబెట్టుకోవాలన్న హోంమంత్రి

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటను కేంద్రం నిలబెట్టుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఒక ప్రైవేట్​ కార్యక్రమానికి హాజరైన ఆమె... ప్రత్యేక హోదా తదితర విషయాలపై మాట్లాడారు. అధిక నిధులు, ప్రత్యేక హోదా ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని రైతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్ని విధాలా ఆదుకుంటారని ఆమె చెప్పారు. రాష్ట్రంలో నేరాలు 6 శాతం తగ్గాయన్నారు. రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని.. ఇప్పటికే దర్యాప్తు చేయడానికి ఈడీకి పంపించినట్లు వెల్లడించారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ఉప్పూడిలో అదుపులోకి రాని పరిస్థితి... సమీప గ్రామాలన్నీ ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.