ETV Bharat / state

గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నా.. ఈ నిందలేంటీ ? అంధబాలిక హత్య ఘటనలో హోంమంత్రి తానేటి వనిత - హోంమంత్రి అనిత

Home minister Anitha : మహిళల సమస్యలపై తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తోందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. తాడేపల్లిలో జరిగిన అంధ బాలిక హత్యోదంతంలో నిందితుడిని పోలీసులు వెెంటనే అదుపులోకి తీసుకున్నారని ఆమె వెల్లడించారు. అదే సమయంలో అందబాలిక హత్య ఘటనపై మంత్రి తీవ్రంగా స్పందించారు.

హోంమంత్రి తానేటి వనిత
హోంమంత్రి తానేటి వనిత
author img

By

Published : Feb 14, 2023, 4:52 PM IST

Updated : Feb 14, 2023, 6:16 PM IST

Home minister Anitha : తాడేపల్లి అంధబాలిక హత్యోదంతంపై హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది అన్నారు. తాడేపల్లి అంధబాలిక హంతకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అంధ బాలికను గంజాయి మత్తుతో హత్య చేయలేదని, వ్యక్తిగత కక్ష అందుకు కారణమని పేర్కొన్నారు. హత్య ఘటన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినా... పోలీసులే అతడిని అరెస్టు చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇరుగుపొరుగు కావడంతో అంధ బాలిక హత్య జరిగిందని హోం మంత్రి తెలిపారు.

గంజాయి అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్నాం... ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నట్టు గంజాయి మత్తులో హత్య చేయలేదు.. మద్యం మత్తులో హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతోన్నా.. ప్రభుత్వం మీద నిందలు వేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగితే.. అప్పటి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలబడేవారని ఆరోపించారు. తాడేపల్లి ఘటన లో తాము ఎందుకు రాజీనామా చేయాలని మంత్రి వనిత ప్రశ్నించారు. పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి చనిపోతే చంద్రబాబు నాడు సీఎం పదవికి రాజీనామా చేశారా..? అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. కందుకూరు, గుంటూరు సంఘటనల్లో 11 మంది చనిపోతే ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేశారా..? అని మంత్రి వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఇది గంజాయి మత్తులో జరిగిన హత్య కాదు.. మద్యం మత్తులో జరిగింది. హత్య జరిగిన గంట వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేయడం పోలీస్ శాఖ పనితీరు, సిబ్బంది కృషిని తెలియజేస్తుంది. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనతో పాటు, నేరాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. - తానేటి అనిత, హోంశాఖ మంత్రి

అత్యాచారం కేసులో... సీతా నగరంలో మహిళా నర్సు పై అత్యాచార ఘటన లో మరో నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడని హోం మంత్రి వనిత తెలిపారు. అతన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నమన్నారు. పదేపదే సెల్ ఫోన్ సిమ్ లు మార్చడం వల్ల పట్టుకోలేక పోతున్నామని, జీరో ఎఫ్ ఐ ఆర్ లను నమోదు చేస్తున్నా పూర్తి వివరాలు తన వద్ద వివరాలు లేవని ఆమె వివరించారు.

హోంమంత్రి తానేటి వనిత

ఇవీ చదవండి :

Last Updated : Feb 14, 2023, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.