ETV Bharat / state

తెరపైకి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్..! కొత్త వాహనాలకు డీలర్లే అందించాలీ..!

రోడ్డెక్కే ప్రతి వాహనానికీ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి.. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో అధికారులను పలు సూచనలు చేశారు. పాత వాహనాలకు నిర్దిష్ట గడువు ఇచ్చి ఏర్పాటు చేసుకొనేలా చూడాలని సీఎస్ స్పష్టం చేశారు.

high security number plates
high security number plates
author img

By

Published : Jan 13, 2023, 11:01 AM IST

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత అంశంపై సీఎస్ అధ్యక్షతన సచివాలయంలో అత్యు్న్నత స్థాయి సమావేశం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న సహా పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి : సుప్రీం కోర్టు ఆదేశాలు అనుసరించి రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే.ఎస్.జవహర్ రెడ్డి రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో రోడ్డు సేప్టీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని రకాల వాహనాలకు తప్పని సరిగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ స్పష్టం చేశారు. కొత్తగా కొనుగోలు చేసే వారికి ఆయా వాహనాల డీలర్లు హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతో వాటిని అందించేలా చూడాలని అన్నారు. అలాగే పాత వాహనదారులు కూడా ఒక నిర్దిష్ట వ్యవధిలోగా హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ వాహనాలపై అధికారుల హోదాతో కూడిన నామ ఫలకాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని.. కేవలం "ప్రభుత్వ వాహనం" అని మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ చేట్టాల్సిందిగా రవాణా, పోలీస్ శాఖలను ఆదేశించారు. ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని రవాణా, అద్దె వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు వంటి వాహనాల వెనుక భాగంలో విధిగా రేడియం టేపు అతికించి ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశాలున్న అన్ని ముఖ్య కూడళ్లలో తప్పని సరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించాలని చెప్పారు. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఏర్పాటు చేసుకునేలా రవాణా, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ.కృష్ణ బాబు అన్నారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలు స్క్రాపింగ్ చేసేందుకు వీలుగా యూనిట్ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. అందుకు వారికి ప్రభుత్వం నుండి రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న కోరారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాల్లోని ఆటోమేషన్ ఆఫ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ సివిల్ పనుల ప్రతిపాదనలకు కమిటీ ఆమోదించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కూడా ఈవిధమైన ట్రాకుల అభివృద్ధికి సంబంధించిన సివిల్ పనులకు కమిటీ ఆమోదించింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.