కృష్ణా జిల్లా మైలవరంలో పందిరి సాగుతోపాటు కూరగాయలు పండిస్తే మేలైన ఫలితాలు సాధించవచ్చని స్థానిక రైతు జొన్నల శ్రీనివాసరెడ్డి నిరూపిస్తున్నాడు. కౌలుకి తీసుకున్న భూమిలో పొట్ల, సొర, టమాటా పంటలు ఏక కాలంలో సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరూ సాగు చేస్తున్న తీరుకి భిన్నంగా.. ఎండాకాలంలో అధిక దిగుబడినిచ్చే రకాలను సాగు చేస్తూ కష్టానికి తగ్గ ఫలితం పొందవచ్చని చెప్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని అంటున్నారు. ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తే ఖర్చులు తగ్గి మరింత మేలు జరుగుతుందని.. తద్వారా లాభాల బాటలో కూరగాయలు సాగుచేసే అవకాశం ఉంటుందని రైతులు ఆశావాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కొనేవాళ్లు లేక టమాటా గంగపాలు