కొవిడ్ కేసులు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టు విచారణ జరిపింది. పడకల లభ్యతపై డాష్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయిలో వాలంటీర్ల ద్వారా పడకల సమాచారం ఇస్తామని తెలిపింది. కాగా కొవిడ్ నియంత్రణ చర్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. సామాజిక కార్యకర్త సురేష్ బాబు, ఏపీసీఎల్ఏ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
కొవిడ్ కేంద్రాలు నగరాలు, పట్టణాల్లో దూరంగా ఉన్నాయన్న అంశంపై చర్చించిన న్యాయస్థానం.. కొవిడ్ కేంద్రాలు తక్కువ దూరంలో ఉండేలా చర్యలు చేపట్టటంతోపాటుగా.. బాధితులు సులువుగా చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. అధిక ఫీజులు తీసుకుంటే నోడల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయవచ్చని.. బిల్లులు చెల్లింపులు సైతం నోడల్ ఆఫీసర్ల ద్వారా చేపడుతున్నామన్న ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చూడండి...