న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ పిటిషన్ వేశారు.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్రెడ్డి, పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐతో సహా 44 మందికి నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం 49 మందికి నోటీసులు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. నిందితులపై చర్యలకు సంబంధించి పూర్తి వివరాలతో సీఐడీ అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి షాక్.. ఎస్ఈసీ రమేష్ కుమార్ను మళ్లీ నియమించిన హైకోర్టు