మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. సత్తెనపల్లి నైపుణ్యాభివృద్ధి సంస్థలోని ల్యాప్టాప్లను శివరామకృష్ణ సూచనలతో కొందరు వ్యక్తులు తీసుకెళ్లారంటూ... ఆ సంస్థ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: 'ఒప్పందం ఉల్లంఘిస్తే... ఎందుకు రద్దు చేయలేదు..?'