ETV Bharat / state

'కొవిడ్ ఆసుపత్రుల నిర్వహణకు సహకరించండి' - కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వార్తలు

కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి పెరిగిందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. ఈ క్రమంలో జిల్లాలో మరో ఐదు కొవిడ్ ఆస్పత్రుల నిర్వహణకు సహకారం అందించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్​ను కోరారు.

help to provide Covid services through five other hospitals, collector requests ima

author img

By

Published : Jul 4, 2020, 8:15 PM IST

కృష్ణా జిల్లాలో మరిన్ని కొవిడ్ ఆసుపత్రులు నిర్వహించేందుకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) సహకారం అందించాలని కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌ కోరారు. తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌ వైద్య సేవల నిర్వహణపై ఐఎంఏ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో మూడు ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నామని... అనుమానితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు.

'ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో ఐదు ఆసుపత్రుల ద్వారా కొవిడ్‌ సేవలు అందించేందుకు ఐఎంఏ పూర్తి సహకారం అందించాలి. ప్లాస్మాథెరపీ ద్వారా చికిత్స అందించి రోగిని ప్రమాద స్థాయి నుంచి రక్షించేందుకు వైద్యులు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి' అని కలెక్టర్ కోరారు.

కొవిడ్ వైద్య సేవలు అందించే వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన బీమా పథకం అమలు చేయాలని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్‌ కలెక్టర్​ను కోరారు. జిల్లాలో 2,400 మంది వైద్యులు ఐఎంఏ సభ్యులుగా ఉన్నారని... వారిలో స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించే వారిని గుర్తించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి

'ఎస్‌ఎమ్‌ఎస్‌ విధానంతో కరోనా దూరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.