బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సంబంధిత అధికారులు, రెవెన్యూ యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు సిద్దంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి: పలు జిల్లాల్లో భారీ వర్షాలు..రహదారులన్నీ జలమయం