.
పలు జిల్లాల్లో భారీ వర్షాలు..రహదారులన్నీ జలమయం - ongole rain news
వర్షాల కారణంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో రహదారులు, నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఒంగోలులో రెండు గంటలపాటు కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ప్రాంతం, కొత్తపట్టణం సెంటర్, లాయర్‌పేట వర్షపు నీటితో మునిగిపోయాయి. సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో రోడ్లు, కాలువలు ఏకమయ్యాయి. నెల్లూరులో వాతావరణం ఆహ్లాదకరంగా కనబడుతోంది. వర్షం వల్ల రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
rain-in-ongole-prakasham
.
sample description