వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట నీట మునిగింది. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, మినుము, చెరకు తదితర పంటలకు తీరని నష్టం వాటిల్లింది. మొత్తం 9 జిల్లాల్లో 71,821 హెక్టార్లలోని పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించింది. అత్యధికంగా ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో పంట నష్టం వాటిల్లిందని అందులో పేర్కొంది. తొమ్మిది జిల్లాల్లో 24 రకాల పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసింది.
వ్యవసాయ శాఖ ప్రకారం పంట నష్టం ఇలా
పంట నష్టం (హెక్టార్లలో) వరి 54,694 పత్తి 12,047 మినుము 1600 చెరకు 310 వేరుశెనగ 836
కడప జిల్లాలో 476 హెక్టార్లలో ఇసుక మేటలు, 53 హెక్టార్లలో భూమి కోతతో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 29,943 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 13,976 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 12,466 హెక్టార్లలోని వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 158 హెక్టార్లలో పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది.
ఇదీ చదవండి: