ETV Bharat / state

30 ఏళ్ల తరవాత కొల్లేరుకు భారీ వరద - కొల్లేరు సరస్సు తాజా వార్తలు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు కొల్లేరు ప్రాంతం తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటోంది. సమీప గ్రామాలన్నీ మునిగిపోయాయి. ఉప్పుటేరు ఆక్రమణలకు గురై సముద్రానికి వెళ్లే దారి కుంచించుకుపోవడంతో వరద నీరు కిందకు వెళ్లడం లేదు. దీంతో సమీప గ్రామాల్లోకి నీరు వచ్చి చేరుతుంది.

heavy rains in kolleru lake
కొవ్వాడలంకలో ఓ ఇంటి ఆవరణలో..
author img

By

Published : Oct 23, 2020, 4:31 PM IST

కృష్ణా- గోదావరి నదులకు మధ్య వరద నీటి మళ్లింపునకు సహజసిద్ధంగా ప్రకృతి ఏర్పాటు చేసిన సుందర క్షేత్రం ఇది. జులై, ఆగస్టులో వరద వచ్చి మార్చి, ఏప్రిల్‌ వరకు ఉంటుంది. కొన్నేళ్లుగా అనావృష్టితో కొల్లేరు ప్రాంతం తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఏటా వచ్చే ప్రవాహానికి పదుల రెట్లు ఒకేసారి సరస్సును ముంచెత్తింది. సమీప గ్రామాలన్నీ నీళ్లలో నానుతున్నాయి. చేపలు, రొయ్యల చెరువులన్నీ ఏకమైపోయాయి. వరద ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి కారణమేమిటనే విషయం ప్రస్తుతం కొల్లేరు గ్రామాల్లో చర్చనీయాంశమైంది.

ఇవీ కారణాలు..

కొల్లేరులోని గుర్రపు డెక్క, కిక్కిసగడ్డి, తూడు, డ్రెయిన్ల నుంచి వచ్చే వ్యర్థాలు ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. పైనుంచి వచ్చే స్థాయిలో వరద నీరు సముద్రంలోనికి వెళ్లడం లేదు. ఉప్పుటేరు వద్ద రెండో రైల్వే లైను ఏర్పాటుకు వేసిన వంతెన స్తంభాలు కూడా ప్రవాహానికి అడ్డుపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2006లో అభయారణ్యంలో కొట్టేసిన చెరువులు పశ్చిమ గోదావరి జిల్లాలో 80శాతం, కృష్ణాజిల్లాలో 30శాతం తిరిగి ఆక్రమణలకు గురవడం కూడా కారణమే. సరస్సులోకి చేరే నీరు నేరుగా పోయేందుకు వీలుగా ఛానలైజేషన్‌ లేకపోవడంతో వరద కిందకు వెళ్లడం లేదు. ఉప్పుటేరు ఆక్రమణలకు గురై సముద్రానికి వెళ్లే దారి కుంచించుకుపోవడంతో వరద నీరు కిందకు వెళ్లడం లేదు.

అధికారులు ఏమన్నారంటే..

కొల్లేరునీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క తొలగింపు చర్యలు చేపడుతున్నట్లు డ్రెయినేజీ శాఖ డీఈ శిరీష తెలిపారు. గతంలో కొల్లేరు ప్రధాన ఛానెల్‌ చంద్రయ్య కాలువను కోమటిలంక వరకు ఛానలైజేషన్‌ చేసినట్లు వివరించారు..కొల్లేరులో ఆక్రమణలు తొలగించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖాధికారులు పేర్కొంటున్నారు.

పూడిక పెరిగిపోవడంతోనే..

కొల్లేరుకు పూడిక పెరిగిపోయింది. వస్తున్న వరద నేరుగా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోనికి వెళ్లేందుకు వీలుగా ఛానలైజేషన్‌ చేయాలి. విపత్తులకు అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడం, ఉప్పుటేరు కుంచించుకు పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. - చింతపల్లి వెంకటనారాయణ, కైకలూరు

అపురూపమైన పక్షులతోపాటు అరుదైన జీవవైవిధ్యానికి నిలయమైన కొల్లేరు పరివాహక ప్రాంతం నేడు వరద నీటిలో కొట్టుమిట్టాడుతోంది. లంకలతో పాటు సాధారణ గ్రామాలు సైతం నీటిలోనే నానుతున్నాయి. రోజుల తరబడి ప్రజలు కనీసావసరాలకు అష్టకష్టాలు పడుతున్నారు. మూడు దశాబ్దాల కిందట వచ్చిన వరద వారం రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చింది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటంతో పరివాహక ప్రాంతంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం ఆదుకోవాలి

కొల్లేరు వరదల్లో చిక్కుకుని కాలం వెళ్లదీస్తున్న గ్రామాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మత్స్యకారుల వలలు మావులతోపాటు, చేపల చెరువులు సైతం కొట్టుకుపోయిన వారికి సహాయాన్ని అందించాలి. గ్రామాల్లో రక్షిత భవనాలను నిర్మించి పునరావాసాన్ని కల్పించాలి. - ఘంటసాల వెంకటేశ్వరరావు, బీఎంఎస్‌ మత్స్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఇదీ చదవండి :

పెరిగిన భూగర్భ జలాల మట్టం... బోరుబావిలో పొంగుతున్న నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.