నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి కృష్ణా జిల్లాలో 16 శాసన సభ స్థానాలకు మొత్తం 232 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మొత్తం 337 మంది నామినేషన్లు దాఖలు కాగా.. వీటిల్లో 83 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 4 నామినేషన్లు తిరస్కరించగా... ఇద్దరుఉపసంహరించుకున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 6 తిరస్కరణకు గురి కాగా... చివరికి 15 మంది పోటీలో నిలిచారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 22 మంది బరిలో నిలిచారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పోటీ చేస్తోన్న మైలవరంలో 18 మంది పోటీలో నిలిచారు. 17 మంది అభ్యర్థులతో విజయవాడ సెంట్రల్ మూడో స్థానంలో నిలిచింది. అతి తక్కువగా మచిలీపట్నం శాసన సభ నియోజకవర్గంలో 8 మందే తలపడుతున్నారు. గుడివాడ మినహా అన్ని స్థానాల్లో తెదేపా, వైకాపా, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలువురు స్వతంత్రులు ఉన్నారు. గుడివాడలో జనసేన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనందున అక్కడ తెదేపా, వైకాపా మధ్య పోరు ఉండనుంది. జిల్లా మొత్తంగా 83 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా... 22 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
పెనమలూరు నియోజకవర్గంలో భార్యాభర్తలు పోటీలో నిలిచారు. ఇక్కడ వైకాపా నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థ సారథిపోటీలో ఉండగా.. ఆయన సతీమణి కమల లక్ష్మి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. తిరువూరు -12, నూజివీడు -11, గన్నవరం - 14, గుడివాడ - 12, కైకలూరు -14, పెడన -9, మచిలీపట్నం - 8, అవనిగడ్డ- 12 , పామర్రు -12, పెనమలూరు - 13, విజయవాడ పశ్చిమ -22, విజయవాడ సెంట్రల్ -17, విజయవాడ తూర్పు -12, మైలవరం -18, నందిగామ -9, జగ్గయ్యపేట -10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
నియోజకవర్గం | వచ్చిన నామినేషన్లు | తిరస్కరణ | విత్ డ్రా | మిగిలింది |
తిరువూరు | 19 | 7 | 0 | 12 |
నూజివీడు | 15 | 3 | 1 | 11 |
గన్నవరం | 16 | 2 | 0 | 14 |
గుడివాడ | 20 | 8 | 0 | 12 |
కైకలూరు | 22 | 5 | 3 | 14 |
పెడన | 13 | 3 | 1 | 9 |
మచిలీపట్నం | 12 | 3 | 1 | 8 |
అవనిగడ్డ | 16 | 3 | 1 | 12 |
పామర్రు | 18 | 5 | 1 | 12 |
పెనమలూరు | 17 | 4 | 0 | 13 |
విజయవాడ పశ్చిమ | 32 | 4 | 6 | 22 |
విజయవాడ సెంట్రల్ | 23 | 4 | 2 | 17 |
విజయవాడ తూర్పు | 15 | 3 | 0 | 12 |
మైలవరం | 24 | 5 | 1 | 18 |
నందిగామ | 16 | 6 | 1 | 9 |
జగ్గయ్యపేట | 20 | 8 | 2 | 10 |
మొత్తం | 337 | 83 | 22 | 232 |