ETV Bharat / state

తెలంగాణ : కేబినెట్ నుంచి ఈటల తొలగింపు.. ఉత్తర్వులిచ్చిన గవర్నర్ - మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ తొలగింపు

తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌... ఈటలను మంత్రివర్గం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తెలంగాణ : ఈటెల మంత్రి పదవి తొలగింపు.. ఉత్తర్వులిచ్చిన గవర్నర్

author img

By

Published : May 2, 2021, 9:54 PM IST

Updated : May 2, 2021, 10:12 PM IST

తెలంగాణ : ఈటెల మంత్రి పదవి తొలగింపు.. ఉత్తర్వులిచ్చిన గవర్నర్
తెలంగాణ : ఈటెల మంత్రి పదవి తొలగింపు.. ఉత్తర్వులిచ్చిన గవర్నర్

తెలంగాణ కేబినెట్ నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. సీఎం కేసీఆర్‌ సిఫార్సు మేరకు ఆ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈటలను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

బృందాలుగా ఏర్పడి..

మెదక్‌ జిల్లాలోని అచ్చంపేట పరిధిలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు మెదక్‌ జిల్లా అచ్చంపేటలో విచారణ చేపట్టారు. తూప్రాన్‌ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో ఈటలకు చెందిన జమున హ్యాచరీస్‌ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ సర్వే నిర్వహించారు.

కలెక్టర్ పరిశీలన..

తూప్రాన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, మాసాయిపేట తహసీల్దార్‌ ఆఫీసులో రికార్డులను పరిశీలించారు. మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. అనంతరం కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. శనివారం దర్యాప్తునకు సంబంధించిన పూర్తి నివేదికను సీఎస్‌కు అందించారు.

సీఎం సిఫార్సు మేరకు..

ఈటలపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శనివారం ఈటల నుంచి వైద్యఆరోగ్య శాఖను ప్రభుత్వం తప్పించింది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటలను తప్పించాలంటూ గవర్నర్‌ తమిళిసైకు సీఎం సిఫార్సు చేయగా ఆమె ఆమోదించారు. ఆ శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ సైతం విడుదల చేశారు.

రాజశేఖర్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలు..

ఈటలను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించిన వెంటనే ఆ శాఖ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. తన కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించారు. తాజాగా రాజేందర్​ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి:

కొవిడ్ చికిత్సకు అనుమతులు తీసుకోండి.. లేదంటే కఠిన చర్యలే: సింఘాల్

Last Updated : May 2, 2021, 10:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.