వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు . తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం.. ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఆధార్టీని ఏర్పాటు చేయాల్సి ఉందని జీపీ బదులిచ్చారు . భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. చర్యల్లో పురోగతి వివరాల్ని తెలపాలని ఆదేశాలు జారీచేసింది.
ఇదీచదవండి : మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం