ETV Bharat / state

ఏపీఎన్​ఆర్​టీ చొరవతో రాష్ట్రానికి గల్ఫ్ బాధితులు - ఏపీ గల్ఫ్​ బాధితుల కథనాలు

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకున్న బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు ఏపీఎన్​ఆర్​టీ చర్యలు చేపట్టింది. పలువురిని అధికారులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. వారిని స్వస్థలాలు చేర్చేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని ఏపీఎన్​ఆర్​టీ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు.

gulf victims returns to state with the help of APNRT

author img

By

Published : Feb 15, 2021, 11:28 AM IST

గల్ఫ్​ దేశాల్లో చిక్కుకున్న తెలుగు కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్​ఆర్​టీ) చర్యలు చేపట్టింది. ఒమన్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ బాధితులను తీసుకొచ్చేందుకు ఏపీఎన్​ఆర్​టీ ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడతగా 8 మంది బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఆదివారం వీరు ప్రత్యేక విమానంలో మస్కట్​ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి ఏపీఎన్​ఆర్​టీ డిప్యూటీ డైరెక్టర్ అంజన్ స్వాగతం పలికారు. మస్కట్​ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు అయ్యే విమాన ఖర్చులను ఏపీఎన్​ఆర్​టీనే భరించింది. విజయవాడ నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకయ్యే ప్రయాణ ఖర్చు, భోజన ఖర్చును సమకూర్చింది. 0863 2340678, 8500027678 నంబర్లకు ఫోన్​ చేసి ఏపీఎన్​ఆర్​టీ అందించే సేవలు వినియోగించుకోవాలని ఆ సంస్థ అధ్యక్షులు మేడపాటి వెంకట్​ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మదార్​పురం ప్రమాదం: స్వస్థలాలకు మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.