ETV Bharat / state

ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన గుడివాడ యువకుడు - కృష్ణా జిల్లా వార్తలు

నలుగురికి ఉపయోగపడని చదువు ఎందుకు అంటారు పెద్దలు...? అదే స్ఫూర్తిగా తీసుకున్నాడు గుడివాడకు ఓ యువకుడు. తాను నేర్చుకున్న విషయాలు నలుగురికి పంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ...వారి నైపుణ్యాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ప్రతిభ ఉంటే సులభంగా పైచదువులు చదవొచ్చని వారికి తెలియజేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు అందించే స్కాలర్ షిప్ లపై విద్యార్థుల అవగాహన కల్పించి, వాటిని పొందేందుకు విద్యార్థులకు మార్గం సుగుమం చేస్తున్నారు. ఈ యువకుడు చేస్తున్న సేవలను బ్రిటన్ కు చెందిన ప్రిన్సెస్ డయానా ఫౌండేషన్ గుర్తించింది... పురస్కారంతో సత్కరించింది.

ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన గుడివాడ యువకుడు

author img

By

Published : Jul 14, 2020, 9:30 AM IST

కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన గోళ్ల పృథ్వి... సామాజిక సేవ, విద్యాభివృద్ధికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రిన్సెస్‌ డయానా అవార్డు 2020కి ఎంపికయ్యారు. జులై ఒకటో తేదీన లండన్‌లో వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. గుడివాడ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌, చెన్నైలోని సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తమిళనాడులో మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీలో ఎంటెక్‌ పూర్తి చేసిన పృథ్వి... అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో సామాజిక మార్పునకు యువత ప్రధాన చోదక శక్తిగా భావించి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. కళాశాల దశ నుంచే పృథ్వి వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏపీ నుంచి ఒకే ఒక్కరు

నేషనల్‌ యూత్‌ అవార్డు, నేషనల్‌ యూత్‌ ఐకాన్‌, నేషనల్‌ ఫ్రైడ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు, రాష్ట్రీయ యువ గౌరవ్‌ పురస్కార్‌ తదితర అవార్డులను ఇప్పటికే పృథ్వి తన సేవలకు గుర్తింపుగా అందుకున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రిన్సెస్‌ డయానా ఫౌండేషన్‌ అవార్డు ప్రకటిస్తారు. తొమ్మిదేళ్ల నుంచి 24 ఏళ్ల వయసు యువకుల్లో సామాజిక, విద్యా విషయాల్లో ఉత్తమ సేవలందిస్తోన్న వారు..ఈ అవార్డుకు నామినేట్‌ అవుతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో 180 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. మన దేశంలో 23 మంది యువకులు డయానా అవార్డుకు ఎంపికయ్యారు. వారిలో ఏపీ నుంచి పృథ్వి ఒకరికే అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఎంపికయ్యారు.

2013లో జరిగిన ఓ ఘటన తనను సామాజిక సేవ వైపు నడిపించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు అనేక మంది ఉన్నప్పటికీ.. వారు సరైన దిశలో నడిచేందుకు అవగాహన లోపం అధికంగా ఉంటుంది. ఇటువంటి సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూశాను. మార్పు కోసం నాకు చేతనైనంత ప్రయత్నం చేస్తున్నాను. --- పృథ్వి, డయానా అవార్డు గ్రహీత

రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా చేయటమే లక్ష్యం

మెటీరియల్‌ సైన్స్‌లో పీహెచ్ డీ పూర్తి చేశాక.. రక్షణ రంగంలో శాస్త్రవేత్తగా చేయాలన్నది తన లక్ష్యమని పృథ్వి తెలిపారు. వర్తమాన విద్యా విధానంలో అనేక మార్పులు అవసరమన్నది పృథ్వి అభిప్రాయం. సమాజసేవ కోసం ప్రతి విద్యార్థి కనీసం మూడు, నాలుగు గంటలు పాటుపడేలా బోధనాంశాలు రావాలని ఆకాంక్షిస్తున్నారు. మంచి ఉద్యోగం కోసం చదువు ఒక్కటే సరిపోదని, నైపుణ్య అభివృద్ధి అవసరమని, ఆ దిశగా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు.

అవగాహన కార్యక్రమాలు

విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి ఎలా సాధించాలో...అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలో పృథ్వి అవగాహన కల్పిస్తున్నారు. మిత్రులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను బయటకు తీసేలా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. మెరిట్ విద్యార్థుల పైచదువుల కోసం వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్ షిప్ గురించి తెలియజేస్తూ... వాటికి పొందేందుకు మార్గం సుగుమం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం నిర్వహించే ప్రోత్సాహక కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు పృథ్వి.

బాలల అక్రమ రవాణా... బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, పనిచేయాలనేది తన లక్ష్యమని పృథ్వి చెప్పారు. చిన్నతనం నుంచే చదువు.. సామాజిక అంశాలపై తన కుమారుడు ఉత్సాహం చూపేవాడని.. పృథ్వీ తండ్రి తెలిపారు. పృథ్వీ ప్రతిష్టాత్మక ప్రిన్సెస్‌ డయానా పురస్కారానికి ఎంపిక అవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.

కరోనా కారణంగా డయానా ఫౌండేషన్‌ నుంచి అవార్డును నేరుగా తీసుకోలేకపోతున్నామని పృథ్వి తెలిపారు. అవార్డుకు ఎంపికైన వారందరితో ఫౌండేషన్‌ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించిందన్నారు. ఈ అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని పృథ్వి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.