ETV Bharat / state

Govt Set Back on New Registration System in AP: దిగొచ్చిన ఏపీ సర్కారు.. పాత విధానంలోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్ - Property registrations

Govt Set Back on New Registration System in AP : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ పాత విధానంలోనూ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నూతన విధానంపై డాక్యుమెంట్ రైటర్లు, స్థిరాస్తి వ్యాపారులు సహా ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం దిగివచ్చింది.

Property_registrations_in_AP
Property_registrations_in_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 7:08 PM IST

Govt Set Back on New Registration System in AP : నూతన విధానంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. డాక్యుమెంట్ రైటర్లు, స్థిరాస్తి వ్యాపారులు సహా ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు, అభ్యంతరాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం మెట్టు దిగింది. ఇకపై పాత విధానంలోనూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆప్షనల్​గా మాత్రమే కొత్త విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానంలో ఎదురవుతోన్న సమస్యలను స్థిరాస్తి వ్యాపారులతో తెలుసుకున్న అధికారులు.. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త సాఫ్ట్ వేర్​లో లోపాలన్నింటినీ సరిచేశాకే.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

Sub Registration Offices: సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నరకం.. డబ్బులు తీసుకుంటారు.. కానీ వసతులు కల్పించరు..

Document Writers Dharna: స్థిరాస్తి క్రయ విక్రయాల కోసం రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఉన్న సాఫ్ట్​వేర్​ను ఆధునీకరించిన రాష్ట్ర ప్రభుత్వం... ఆ స్థానంలో కొత్తగా కార్డ్ ప్రైమ్ 2.O పేరిట సాఫ్ట్ వేర్​ను రూపొందించి గత నెల 31న అమల్లోకి తెచ్చింది. ముందస్తుగా స్థిరాస్తి వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్లు, సహా ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకుని సమర్థంగా అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా.. అలా చేయకపోవడంతో సర్వత్రా ఆందోళనలకు దారి తీశాయి. కొత్త సాఫ్ట్ వేర్​తో రిజిస్ట్రేషన్ల వల్ల తాము రోడ్డున పడతామంటూ రాష్ట్రవ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు ధర్నాలకు దిగారు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసే విధానం సహా జారీ చేసే ధ్రువీకరణ పత్రాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో స్థిరాస్తి వ్యాపారులు సహా భూ యజమానులు, క్రయ విక్రయదారులు ఆందోళనకు గురయ్యారు.

నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో.. మొగల్తూరు సబ్‌-రిజిస్ట్రార్ అరెస్ట్

CREDAI Demand Old System for Registraions: క్రెడాయ్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్​మెంట్​ కౌన్సిల్ విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశానికి పలుు ప్రాంతాల నుంచి స్థిరాస్తి వ్యాపారులు, ప్రజలు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కొత్తగా తీసుకువచ్చిన కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా వస్తోన్న సమస్యలను స్థిరాస్తి వ్యాపారులు ఏకరువు పెట్టారు. తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు కమిషనర్ దృష్టికి తెచ్చారు. పాత విధానం సులభంగా ఉండగా.. డిజిటలైజేషన్ పేరిట తీసుకువచ్చిన కొత్త సాఫ్ట్ వేర్​లో పలు సాంకేతిక అంశాలు గందరగోళ పరుస్తున్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పైనా అనుమానాలు వచ్చేలా ఉందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం జారీ చేసే డిజిటల్ పత్రాలు, డాక్యుమెంట్లు బ్యాంకుల్లో, న్యాయస్థానాల్లో చెల్లవని ప్రచారం జరుగుతోందని వీటన్నింటిపైనా వివరణ ఇవ్వాలని కోరారు. పాత విధానాన్నే తిరిగి కొనసాగించాలని గట్టిగా కోరారు.

New System as on Option: మరోవైపు కొద్ది రోజులుగా డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేస్తుండటం, ఆందోళనను ఉద్ధృతం చేయాలని హెచ్చరించిన దృష్ట్యా కొత్త సాఫ్ట్ వేర్​తో రిజిస్ట్రేషన్లపై ఐజీ మెట్టు దిగారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇకపై పాత విధానంలోనూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాత లేదా కొత్త విధానంలో స్థిరాస్తి క్రయ విక్రయాలను చేసుకోవచ్చని, ఆప్షనల్​గా మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. కొత్త విధానంలో వచ్చిన అభ్యంతరాలన్నీ పరిష్కరించిన తర్వాతే రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని హామీ ఇచ్చారు.

New Online Registration Problems in AP: కొత్త రిజిస్ట్రేషన్ విధానం.. వినియోగదారుల గందరగోళం

Registrations IG Respond on Problems: రాష్ట్రంలో 3 రోజులుగా 'కార్డ్ ప్రైమ్ ' అనే సాఫ్ట్ వేర్​తో కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్నిను అమలు చేస్తున్నామని, 24 రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మాత్రమే ప్రయోగాత్మకంగా కొత్త సాఫ్ట్ వేర్ తో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఐజీ రామకృష్ణ తెలిపారు. నెలరోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేశాకే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డేటా ఎంట్రీ చేసుకుని వస్తే రిజిస్టేషన్లు త్వరగా అవుతాయని, లోపాలకు తావు లేకుండా 1999 లో చేసిన పాత సాఫ్ట్ వేర్​ను అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఈ కేవైసీ, ఆధార్ ఆధారంగా స్థిరాస్తుల క్రయ, విక్రయాలు చేస్తున్నామని, కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయగానే వెబ్ ల్యాండ్​లో పేరు ఆటోమేటిక్​గా మారిపోతాయన్నారు. ఆధార్ ఓటీపీ (OTP) ఇష్యూలు మాత్రమే మా దృష్టికి వచ్చాయని, దాని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్ఆర్ఐలకు సంబంధించి మార్పులు చేసేటప్పుడు పాస్ పోర్టు అందించాలనే నిబంధన పెట్టినట్లు తెలిపారు. ఆప్షనల్ గా మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తామన్నారు. ఇంతగా అభ్యంతరాలు వస్తాయని మేము ఊహించలేదన్నారు. టెక్నికల్ సమస్యలను మరింతగా అధిగమించి సులభతరం చేస్తామని, బ్యాంకర్లకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు.

ఒరిజినల్ డాక్యుమెంట్​ను డేటా నుంచి ఎన్ని ప్రింట్లైనా తీసుకోవచ్చని, డాక్యుమెంట్​పై క్యూ ఆర్ కోడ్ ఇవ్వడం వల్ల దీన్ని స్కాన్ చేసి ఎక్కడి నుంచైనా ఒరిజినల్ డాక్యుమెంట్ కాపీ వారసులకు ఇవ్వవచ్చు. దీనివల్ల నకిలీలకు తావుండదని స్పష్టం చేశారు. కొత్త సాఫ్ట్ వేర్ లో లోపాలన్నింటినీ సరిచేశాకే.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అమలు చేయనున్నట్లు తెలిపిన ఆయన... పాత విధానమూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

కరిగిపోయిన స్థిరాస్థి కల.. ఏపీలో ఇలా.. తెలంగాణలో అలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.