ETV Bharat / state

చెరువుల్లా ప్రభుత్వ ఇళ్ల స్థలాలు..లబోదిబోమంటున్న లబ్ధిదారులు - water in govt housing lands at Vijayawada

పేదలకు కేటాయించి ఇళ్ల స్థలాలు వరుసగా కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల చెరువులుగా మారాయి. లబ్ధిదారులు చూసి లబోదిబోమంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గంలో కేటాయించిన ఇళ్ల స్థలాల భూమి చెరువుగా మారింది.

govt hosing lands are fileld with rain water in Vijayawada

author img

By

Published : Jul 20, 2020, 5:25 PM IST

విజయవాడ తూర్పు నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు, గొడవర్రు గ్రామాల్లోని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల భూమి చెరువుగా మారింది. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని 3,108 మంది లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున పంపిణీకి గొడవర్రు-రొయ్యూరు సరిహద్దులో ఏనుగులకోడు (డ్రెయిన్‌) పక్కనే ఉన్న 53.33 ఎకరాల భూమిని ఎకరం రూ.53 లక్షల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ఇక్కడే ఉన్న గొడవర్రు ఊరిచెరువు మాన్యం భూమి సుమారు 10 ఎకరాలను సుమారు ఆరు వందల ప్లాట్లుగా విభజించారు. ఈ రెండు భూముల్లో గత వేసవిలో లేఅవుట్లు వేసి గొడవర్రు ఎస్సీ కాలనీ ద్వారా వెళ్లే డొంక రహదారిపై కొంతమేర రబ్బీసు పోశారు. ఈ భూముల్లోకి ఏనుగులకోడు నీరు ఎగదన్నడంతో రెండున్నర అడుగుల మేర నీరు నిలిచింది. వర్షాలు, దమ్ము చక్రాల ట్రాక్టర్ల ధాటికి అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది.

ఇదీ చూడండి

నిమిషాల వ్యవధిలో 100 యోగా భంగిమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.