ETV Bharat / state

క్రైస్తవులకు గవర్నర్ బిశ్వభూషణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు - governor vishwabhushan latest news update

క్రైస్తవులకు సోదరులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం తాను సైతం క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉందన్న ఆయన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

governor wishes to christians on christmas
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
author img

By

Published : Dec 24, 2020, 1:17 PM IST

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయమన్న ఆయన... విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ, సహనం, కరుణపూర్వక అనుబంధాలను మేలుకొలిపే సందర్భమని చెప్పారు.

ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసు క్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం తాను కూడా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉందని.. సాంఘిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా పండుగను జరుపుకోవాలని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

27న రాష్ట్రానికి ఉప రాష్ట్రపతి.. విజయవాడలో 3 రోజులు పర్యటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.