ETV Bharat / state

'కరోనాను ఎదుర్కొనేందుకు నాలుగు "టీ" ల సూత్రాన్ని అనుసరించాలి' - ఏపీలో కరోనా కేసులు

కొవిడ్ వైరస్ సంక్షోభానికి త్వరలో పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాక్షించారు. మానవ ఆవిష్కరణలు సామర్ధతకు త్వరలో ఫలితం ఉంటుందని అన్నారు. రాష్ట్ర గవర్నర్​గా ఏడాది పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

governor comments
governor comments
author img

By

Published : Jul 23, 2020, 10:59 PM IST

కొవిడ్ -19 మహమ్మారిని మానవజాతి ఎదుర్కొంటోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రగతిశీలమైన ఆంధ్రప్రదేశ్​కు.. రాష్ట్ర గవర్నర్‌గా ప్రజలకు సేవచేసే అవకాశం లభించిందని.. ఇది తనకు చాలా గర్వకారణమన్నారు. దేశంలో కొవిడ్ కేసులు తీవ్రతరం అవుతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి నివారణకు తమ వంతు కృషి చేస్తున్నాయన్నారు. కరోనా వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు నాలుగు "టీ" ల సూత్రాన్ని అనుసరించాలన్నారు. అవి ‘ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్’ అని వివరించారు.

వైరస్​ను ఓడించడానికి నివారణే ఉత్తమ మార్గమని.. ప్రజలు వీలైనంత వరకూ ఇంట్లో ఉండాలని గవర్నర్​ కోరారు. భారీగా చెట్ల పెంపకం ద్వారా మాత్రమే.. వాతావరణ మార్పులతో ఉత్పన్నమయ్యే చెడు ప్రభావాలను ఎదుర్కో వచ్చని సూచించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేయడమే లక్ష్యమన్నారు. ఏడాదిగా తనపై ప్రేమ, ఆప్యాయత చూపి చక్కటి సహకారాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 9వేలకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.