ETV Bharat / state

ఈఎస్​ఐ కేసులో అరెస్టైన సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్

ఈఎస్​ఐ కుంభకోణం కేసులో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్​పై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Murali Mohan arrested in ESI scam case
Murali Mohan arrested in ESI scam case
author img

By

Published : Aug 7, 2020, 10:41 PM IST

ఈఎస్​ఐ అవినీతి కేసులో అరెస్టైన ఏపీ సచివాలయ ఉద్యోగి మురళీ మోహన్​ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈఎస్​ఐ కుంభకోణంలో ఆయనపై అభియోగాలు మోపుతూ ఏసీబీ అరెస్టు చేయటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

జులై 10వ తేదీన సచివాలయంలో మురళీ మోహన్​ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కార్మిక శాఖ మాజీ మంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఈఎస్ఐ కుంభకోణంలో మురళీ పాత్ర ఉందని ఏసీబీ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అరెస్టయిన నాటి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖలో సెక్షన్ ఆఫీసరుగా మురళీ మోహన్ విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి

బెయిల్​ వచ్చిన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.